ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటి కొళాయి లక్ష్యం 36 శాతం పూర్తి

ABN, First Publish Date - 2022-10-08T05:23:16+05:30

జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ 36 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 7: జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ 36 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈలు, ఏఈలతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం జలజీవన్‌ మిషన్‌ కింద 39,594 కొళాయి కనెక్షన్లకు గాను 14,364 కనెక్షన్లు ఇచ్చామన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం 488 పనులు మంజూరు కాగా 457 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. డిసెంబరు 21న జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T05:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising