ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు 125 గోదాముల మంజూరు

ABN, First Publish Date - 2022-05-27T06:51:35+05:30

రైతులు పండించిన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్ఢు , ఆర్బీఐల ఆధ్వర్యంలో 125 గోదాముల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్ట్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 26: రైతులు పండించిన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్ఢు , ఆర్బీఐల ఆధ్వర్యంలో 125 గోదాముల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. గురువారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి పి.ఎస్‌.ప్రద్యుమ్న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాముల నిర్మాణాలకు లభ్యత మేర 25సెంట్ల నుంచి  ఎకరా స్థలం ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. 32 మల్టీ పర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ మంజూరు కాగా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సింగిల్‌ విండోల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ గోదాముల నిర్మాణాలకు సంబంధించి భూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 697 పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 577 చెత్త సంపద తయారీ  కేంద్రాల ద్వారా వర్మీకంపోస్ట్‌ తయారు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-05-27T06:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising