ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో Tension.. Tension

ABN, First Publish Date - 2022-08-25T16:52:58+05:30

కుప్పంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(TDP chief Chandrababu Naidu) ప్రారంభించాల్సిన అన్నాక్యాంటిన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Chittoor: కుప్పంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(TDP chief Chandrababu Naidu) ప్రారంభించాల్సిన అన్నాక్యాంటిన్‌(Annacantin) దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ(YCP) శ్రేణులు నిరసనకు దిగారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ(TDP) కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను.. వైసీపీ కార్యకర్తలు చించివేశారు. అలాగే ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు చంద్రబాబు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.


ఇక.. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మూడ్రోజుల పర్యటన బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో పర్యటించారు. నేడు గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు.

Updated Date - 2022-08-25T16:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising