ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌ క్షమాపణ చెప్పాలి: నారాయణ

ABN, First Publish Date - 2022-03-17T00:47:51+05:30

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పవిత్రమైన సమ్మక్క-సారక్క ఉత్సవాలను చినజీయర్‌ స్వామి హేళన చేస్తూ మాట్లాడడం అభ్యంతరకరమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పవిత్రమైన సమ్మక్క-సారక్క ఉత్సవాలను చినజీయర్‌ స్వామి హేళన చేస్తూ మాట్లాడడం అభ్యంతరకరమని సీపీఐ నేత నారాయణ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క- సారక్క జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిపారు. కొందరు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తే.. మరికొందరు పోరాట స్థలంగా భావిస్తారని చెప్పారు. పన్ను విధానాలపై ఆనాటి పాలకులతో పోరాటం జరిపే క్రమంలో సమ్మక్క-సారక్క వెలుగులోకి వచ్చారని గుర్తుచేశారు. రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను చుట్టూ పెట్టుకుని మేధావిగా చలామణి అయ్యే చినజీయర్‌ స్వామికి సమ్మక్క- సారక్కలను విమర్శించే అర్హతలేదన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన సమ్మక్క- సారక్క ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడిన చినజీయర్‌ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-03-17T00:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising