ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షాతోభేటీ లేకుండానే...

ABN, First Publish Date - 2022-01-05T08:15:10+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుదిరిగారు. ఆయన ఢిల్లీకి రాకముందు గత రెండు, మూడు రోజుల నుంచే ప్రధాని నరేంద్రమోదీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఢిల్లీలో ఉన్న రెండు రోజులూ కలిసే యత్నం
  • అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందనే ఆశతో
  • మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురుచూపులు
  • చివరికి వెనుతిరిగిన ముఖ్యమంత్రి జగన్‌


న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుదిరిగారు. ఆయన ఢిల్లీకి రాకముందు గత రెండు, మూడు రోజుల నుంచే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలతో భేటీ కావడానికి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంటు సోమవారం 4గంటలకు లభించింది. కానీ అమిత్‌షా సమయం కేటాయించలేదు. మోదీని కలిసిన తర్వాత సోమవారం రాత్రంతా అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం విఫల ప్రయత్నం చేశారు.


మంగళవారమైనా కలుస్తారేమోననే ఆశతో మధ్యాహ్నం మూడుగంటల వరకు ఎదురు చూసారు. అయినా, అమిత్‌షా కార్యాలయం నుంచి ఎలాంటి  సానుకూల సంకేతాలూ రాలేదు. దీంతో సాయంత్రం 4గంటలకు బయలు దేరాల్సిన సీఎం... మూడింటికే తన అధికార నివాసం 1-జన్‌పథ్‌ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చేశారు. ప్రధానితో తన వ్యక్తిగత ఇబ్బందులను ఏకరువు పెట్టుకున్నట్టే, అమిత్‌షాతో కూడా చెప్పుకోవాలని జగన్‌ ఆశపడినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అమిత్‌షాను కలవడానికి అపాయింట్‌మెంటే కోరలేదని ఒక ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తొలుత కలవాలని భావించినప్పటికీ, ప్రధానితో భేటీ అయినందువల్ల ఇక అమిత్‌షాను కలవనవసరంలేదని సీఎం భావించినట్లు ఆ అధికారి వివరించారు. 

Updated Date - 2022-01-05T08:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising