ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలీసు కంప్లైంట్‌ అథారిటీ’ నిబంధనల్లో మార్పులు

ABN, First Publish Date - 2022-08-11T09:14:30+05:30

‘పోలీసు కంప్లైంట్‌ అథారిటీ’ నిబంధనల్లో మార్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్పు చేసింది. రాష్ట్ర కమిటీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారుసుల మేరకు ముగ్గురిని సభ్యులుగా నియమిస్తారు. అదేవిధంగా జిల్లాలో మానవహక్కుల కమిషన్‌, లోకాయుక్త సిఫారసుల మేరకు ముగ్గురు సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఐదుమంది, జిల్లా స్థాయిలో ఐదుమంది వరకు సభ్యులుంటారు. ఇందులో అడిషనల్‌ ఎస్పీ, అంతకన్నా పైస్థాయి పోలీసులు ఉన్నతాధికారులపై వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర పోలీసు కంప్లైంట్‌ అథారిటీ సెల్‌ పరిశీలిస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాలను మార్పు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ్‌షకుమార్‌ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2022-08-11T09:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising