ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-01-03T01:44:48+05:30

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పక్కనే మరో విగ్రహం పెడతామనడం సరికాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం.. ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తతలు సృష్టించారని తప్పుబట్టారు. పంతం కోసం మరో విగ్రహం పెడతామన్న ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదులను పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదన్నారు. దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-03T01:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising