ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు చెందిన కబ్జా భూమి వ్యవహారంపై తాజా అప్డేట్ ఇదీ..

ABN, First Publish Date - 2022-02-20T12:32:34+05:30

చంద్రబాబుకు చెందిన కబ్జా భూమి వ్యవహారంపై తాజా అప్డేట్ ఇదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ..
  • రికార్డుల్లో నమోదు చేస్తాం 
  • చంద్రబాబు భూములపై తహసీల్దారు సూచన


చిత్తూరు జిల్లా/చంద్రగిరి : మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను నారా ఖర్జూరనాయుడు పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తహసీల్దారు శిరీష సూచించారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మాజీ సీఎం చంద్రబాబుకు చెందిన 38 సెంట్లు కబ్జాకు గురైందన్న ఫిర్యాదుపై ఆమె శనివారం రికార్డులను పరిశీలించారు. శేషాపురం రెవెన్యూ నారావారిపల్లెలో సర్వే నంబర్‌ 222-5లో 87 సెంట్ల భూమిని చంద్రబాబు తండ్రి నారా ఖర్జూరనాయుడు, అదే గ్రామానికి చెందిన తన బంధువు నారా కృష్ణమనాయుడు వద్ద 1989లో కొన్నారు. 49 సెంట్లను ప్రభుత్వాస్పత్రి, టీటీడీ కల్యాణ మండపానికి ఉచితంగా ఇచ్చారు. మిగిలిన 38 సెంట్ల భూమి తమదేనంటూ అప్పట్లో భూమి అమ్మిన కృష్ణమనాయుడు కుమారుడు రాజేంద్రనాయుడు రాతి స్తంభాలు నాటారు. 


దీనిపై నారా రామూర్తి నాయుడు సతీమణి ఇందిర శుక్రవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇరువురు రికార్డులను తీసుకురావాలని తహసీల్దారు సూచించారు. రాజేంద్రనాయుడు మాత్రం రికార్డులను తీసుకురాలేదు. చంద్రబాబు కుటుంబీకుల తరపున కందులవారిపల్లె ఉపసర్పంచ్‌ రాకేష్‌చౌదరి, నారా చిన్నబ్బనాయుడు ఈసీ డాక్యుమెంట్‌ తీసుకొచ్చారు. ఇందులో 1989లో ఖర్జూర నాయుడికి కృష్ణమనాయుడు స్థలం అమ్మినట్లు ఉంది. దీనిపై తహసీల్దార్‌ శిరీష  ఇరువురితో చర్చించారు. మ్యూటేషన్‌ కడితే ఖర్జూరనాయుడు పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. తనకు వారం రోజులు గడువిస్తే ఈభూమిపై చంద్రబాబు వద్ద మాట్లాడుకుంటామని రాజేంద్రనాయుడు కోరారు.  


Updated Date - 2022-02-20T12:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising