ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

flood: వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-07-28T23:21:14+05:30

రద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. వరద బాధితులకు రూ. 2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రూ. 2వేలతో ప్రజల కష్టాలు పూర్తిగా తీరుతాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం (Polavaram) కట్టలేమని చేతులెత్తేశారని ఎద్దేవాచేశారు. బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ (Diaphragm wall) కొట్టుకుపోయిందని చంద్రబాబు తెలిపారు.


చంద్రబాబు మరో విడత వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పోయిన వారం రెండు రోజుల పాటు ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను కలిశారు. అప్పుడే విలీన మండలాలకు కూడా వెళ్లాలని భావించినా అప్పటికి ఆ ప్రాంతంలో వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. గురువారం ఉదయం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటిస్తారు. ఆ రాత్రి ఆయన భద్రాచలంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం రామాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అదేరోజు ఎటపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు.

Updated Date - 2022-07-28T23:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising