ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర హీనుడిగా జగన్.. ఈ విజయం 5 కోట్ల మంది ప్రజలది: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-03-03T23:32:46+05:30

ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై కోర్టును తీర్పును ఆయన స్వాగతించారు. రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడని, రాజధాని ఇక్కడే అన్నారని, 3 క్యాపిటల్ అని ఇప్పుడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టాడని చంద్రబాబు గుర్తు చేశారు. పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవని ఎద్దేవా చేశారు. రాజధానిలో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారని, కృష్ణానది పక్కన ఉండే భూమిని శ్మశానం అన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారని పక్కగా సీఆర్డీఏ చట్టం చేశామని చెప్పారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 



‘‘మహిళా రైతులు వీరోచితంగా పోరాడారు. పాదయాత్రకు వెళ్ళిన రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అంతా చూశాం. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అమరావతి పోరాటం చాటింది. తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారు. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన విజయం 5 కోట్ల తెలుగు ప్రజలది. రాజధాని ఉద్యమ రైతులకు, ప్రజలకు అభినందనలు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారు. నాకు ఏ కులం లేదు...పేదలే నా కులం.’’ అని చంద్రబాబు అన్నారు. 



Updated Date - 2022-03-03T23:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising