ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: వ్యతిరేకత సెగ జగన్‌రెడ్డికి తగులుతోంది

ABN, First Publish Date - 2022-12-15T03:56:50+05:30

ప్రభుత్వ వ్యతిరేకత సెగ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి తగులుతోంది. జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకొంది. దీనితో ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా చేస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందుకే ముందస్తు ఆలోచన చేస్తున్నారు

పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు

‘ఇదేం ఖర్మ...’ కార్యక్రమం బాగా జరుగుతోందని నేతలకు ప్రశంస

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వ్యతిరేకత సెగ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి తగులుతోంది. జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకొంది. దీనితో ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా చేస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ కార్యక్రమ నిర్వహణపై బుధవారం ఆయన అన్ని నియోజకవర్గాల నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం అర్థమయ్యేసరికి ఎన్నికల విషయంలో జగన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఎన్నికలకు వెళ్లాలా? అక్టోబరులో వెళ్లాలా? లేక షెడ్యూల్‌ ప్రకారం 2024లో వెళ్లాలా? అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. పాతికేళ్ల అధికారం... 175 సీట్ల నుంచి ఇప్పుడు ఏ సమయంలో ఎన్నికలకు వెళ్తే గెలుస్తాం అని లెక్కలు వేసుకొనే స్థితికి దిగజారిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నూటికి వెయ్యి శాతం వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించకుండా కొంత కాలం క్రితం వరకూ ప్రజలను భయపెట్టి జగన్‌ ఆపగలిగారు.

ఇప్పుడు ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వలంటీర్లతో బెదిరించినా ప్రజలు ఆగడం లేదు. టీడీపీ సభలు, సమావేశాలకు పెద్ద ఎత్తున వస్తున్నారు’’ అని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడంతో అర్హులకు కూడా పింఛన్లు, ఇతర పథకాల విషయంలో కోతలు పెడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన వారందరికీ టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘జగన్‌రెడ్డి విధానాలతో ఇటు రాష్ట్రం, అటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పులపాలయ్యారు. 13వ తేదీ వచ్చినా ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించలేకపోయారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. టీడీపీ ప్రభుత్వం పన్నెండు లక్షల ఇళ్లు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో కేవలం ఐదు ఇళ్లు మాత్రమే కట్టింది. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. ప్రజల తలసరి ఆదాయంలో మొత్తం దక్షిణాదిలో ఏపీ బాగా వెనుకబడి పోయింది. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఈ విషయాలన్నీ ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రజలకు వివరించాలి’’ అని చంద్రబాబు నేతలకు చెప్పారు. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని పార్టీ నేతలు బాగా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రివర్స్‌ పాలనపై యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందన్నారు. మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, అన్ని అంశాలూ విస్తృతంగా చర్చించాలని బాబు సూచించారు.

Updated Date - 2022-12-15T03:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising