ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దిరెడ్డి అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-01-09T00:35:20+05:30

కుప్పంలోని సి.బండ్లపల్లెలో అక్రమ మైనింగ్‌ను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యం మేలుతోందని ఆయన మండిపడ్డారు. అఖండ సినిమాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలోని సి.బండ్లపల్లెలో అక్రమ మైనింగ్‌ను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యం మేలుతోందని ఆయన మండిపడ్డారు. అఖండ సినిమాలో ఇలాంటి మైనింగ్ మాఫియాను చూశాననన్నారు. సినిమాకు మించిన రితిలో ఇక్కడ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్‌, న్యాయ స్థానానికి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ గ్రానైట్ అక్రమ డబ్బులను మున్సిపల్, పంచాయతీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టారన్నారు. మంత్రిగా పెద్దిరెడ్డికి ఉండే అర్హత లేదని, సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని పదవి నుండి తొలగించాలని, అక్రమ మైనింగ్‌ను ప్రజలే అడ్డుకోవాలన్నారు. ఈ మైనింగ్ కుప్పం ప్రజల సంపదని, ద్రావిడ వర్శిటీలో 150 ఎకరాలలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఇన్ని జరుగుతుంటే పోలీసులు మైనింగ్ మాముళ్ల మత్తులో తూగుతున్నారని మండిపడ్డారు. మాఫియా డాన్‌గా మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారని, అక్రమ మైనింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-01-09T00:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising