ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ntr‎ను మరిపిస్తున్న చంద్రబాబు.. Tdpకి పునర్ వైభవం వచ్చినట్టేనా?

ABN, First Publish Date - 2022-06-21T01:06:48+05:30

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu) జిల్లాల పర్యటన విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ‘ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా‘ (NTR Inspiration-Chandranna Assurance )’ పేరుతో ఆయన ప్రజలను కలుస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు (Mini Mahanadu) నిర్వహించి చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభించారు.


ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని విజయనగరం (Vizianagaram), విశాఖ (Vishaka)తో పాటు తదితర జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు.  దాంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రోడ్ షోలు, బహిరంగ సభలకు జనం పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతగా వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం సమయంలో జనం ఎలా బారులు తీరేవారో ఇప్పుడు కూడా అలా వస్తుండంతో చంద్రబాబును ఎన్టీఆర్‎ను మరిపిస్తున్నారనే భావన టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కలుగుతోంది. 


ఇక చంద్రబాబు పర్యటనకు వస్తున్న జనసంద్రం ఏపీ (AP) రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇంతగా జనం రావటానికి, చంద్రబాబు సభలు ఎన్టీఆర్ సభలను తలపించటానికి వందకు వంద శాతం వైసీపీ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డే (Jagan Reddy) కారణమనే ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన జగన్ అక్కడ నుండి ఒకొక్కటిగా ప్రజా వ్యతిరేక విధానాలకే పాల్పడుతున్నారన్న మాట.. అందరిలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడదే చంద్రబాబుకి మంగళహారతులు అందిస్తోందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. జగన్ రెడ్డి వికృత చేష్టలే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవానికి  అందిస్తున్నాయనే వాదన రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. 




Updated Date - 2022-06-21T01:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising