ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: శ్రీకాంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-01-25T17:48:40+05:30

ప్రజలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: శ్రీకాంత్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కడప జిల్లా ప్రజలను కించపరి చేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు తానే నైట్ కల్చర్ తీసుకుని వచ్చాను అని చెప్పారని, ఆయన వ్యాఖ్యలు ఇప్పటికి అసెంబ్లీ రికార్డులో ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. నాడు ఉద్యోగుల తోకలు కట్ చేస్తామన్న చంద్రబాబు.. నేడు ఉద్యోగ సంఘాలు ఒకే తాటి పైకి రావలనడం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.


ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచినా ముందుకు రాలేదని, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న వారి భ్రమలో ఉద్యోగులు పడొద్దని ఆయన సూచించారు. 1.25 లక్షల ఉద్యోగాలను ఏక కాలంలో ఇచ్చిన ఏకైక ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.


కరోనా లాంటి కష్ట కాలంలో సైతం సంక్షేమ పథకాలను అందించిన ఘనత తమ ప్రభుత్వంది అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పా ల్సిన ఉపాద్యాయులు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని అలా మాట్లాడవచ్చా...? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినా చర్చలకు ఆహ్వానించారని, ఎమ్మెల్యేలుగా జీతాలు లేకుండా పని చేసేందుకు సిద్ధమని, బాధ్యతను విస్మరించకుండా విధులు నిర్వహించాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తన స్వార్థం కోసం పక్క వారిని బలి చేసేందుకు చంద్రబాబు ఎప్పుడు ముందు ఉంటాడని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఏనాడు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి కించపరిచేలామాట్లాడలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని, ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు చేయాలని చూడటం ఏంటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులను చంపుతామని టీడీపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లాలని చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-01-25T17:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising