ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Azadi Ka Amrit Mahotsav: సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు

ABN, First Publish Date - 2022-08-07T00:48:51+05:30

సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆశీనులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీతో పాటు పలువురు సీఎంలు, కేంద్రమంత్రులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి.. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ భేటీకి చంద్రబాబు హాజరైనారు. కమిటీ సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను చంద్రబాబు కలిశారు. సుమారు అరగంట పాటు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబును జాతీయ మీడియా ప్రతినిధుల బృందం కలిసింది. చంద్రబాబును కలిసిన వారిలో ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) సభ్యులతో పాటు పలువురు జాతీయ మీడియా, సీనియర్ జర్నలిస్టులున్నారు. 


దేశ, రాష్ట్ర పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు వేచి చూస్తున్నారని తెలిపారు. ప్రజల నాడి అర్థం కావడంతో.. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవాచేశారు. జగన్ అరాచకాన్ని సాగిస్తున్నాడని అభివృద్ధి ధ్యాసే లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కుప్పకూలిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రవిభజన తర్వాత అన్నిరంగాల్లో ఏపీని.. అగ్రభాగాన నిలిపేందుకు పునాదులు వేశామని, ఏపీ ఆ దిశగా అడుగులు వేసేందుకే.. పోలవరం, అమరావతికి నడుంకట్టామని చెప్పారు. అయితే జగన్ సర్కార్ పోలవరం, అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో ఏపీ అన్నిరంగాల్లో విఫలమైందని తెలిపారు. కోవిడ్ వంటి విపత్తులు ఎదురైనా భారత్ తట్టుకుని నిలబడిందని, పలు దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. భారత్లో ప్రజల తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని చంద్రబాబు కొనియాడారు.

Updated Date - 2022-08-07T00:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising