ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిరాయిగాళ్లతో కారు కూతలు..

ABN, First Publish Date - 2022-08-04T07:44:52+05:30

కిరాయిగాళ్లతో కారు కూతలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ క్రిమినల్‌ రూపం బయటపడింది

తరతరాల రక్త చరిత్రకు వారసుడు

ఆ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరపడింది: లోకేశ్‌


అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): చిన్నమ్మ మరణంతో తాము విషాదంలో ఉంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విషప్రచారం చేస్తూ వినోదం పొందుతున్నారని, ఆయన క్రిమినల్‌ రూపం మరోసారి బయట పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. ‘ఏ సర్వే నంబర్‌ ఎక్కడిదో కూడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారు. కోడికత్తి డ్రామా, బాబాయి గుండెపోటు అంటూ ఆస్కార్‌ రేంజి నటన, ఒకే కులానికి చెందిన 35 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు, పింక్‌ డైమండ్‌ మాయం అంటూ చేసిన అసత్య ప్రచారానికి కొనసాగింపే ఈ తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి నా చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంపై విషప్రచారం. ఈ సారి అసత్య ప్రచారం బయటపడి బొక్కబోర్లా పడ్డారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేయించిన నీచ చరత్ర ఉన్న జగన్‌ రెడ్డి ఎన్నికల్లో సానుభూతి కోసం తన బాబాయి హత్యను కూడా వాడుకొన్నారు. జనాన్ని దోచి దాచుకొని నెత్తుటి కూడు తింటున్న తరతరాల రక్త చరిత్రకు వారసుడు ఆయన. జగన్‌ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడింది. చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్ర్కిప్ట్‌ ప్రకారం శిక్ష అనుభవించి తీరుతారు’ అని లోకేశ్‌ బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఒక ప్రకటనలో మండిపడ్డారు. 

Updated Date - 2022-08-04T07:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising