KCR కొ్త్త పార్టీపై బైరెడ్డి సెటైర్లు
ABN, First Publish Date - 2022-10-17T20:11:30+05:30
కేసీఆర్ (KCR) కొత్త పార్టీపై మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) సెటైర్లు వేశారు.
అమరావతి : కేసీఆర్ (KCR) కొత్త పార్టీపై మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) సెటైర్లు వేశారు. బీఅర్ఎస్ (BRS) కాదు ప్రపంచ పార్టీ అని పెట్టుకోవాలన్నారు. తెలంగాణ అనే పేరు లేకపోతే దానికి బ్రాండ్ లేదన్నారు. బీఅర్ఎస్‌తో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు దూరం అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌వి అన్నీ వింత ఆలోచనలేనన్నారు. రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు చాలా కరువు ప్రాంతాలని పేర్కొన్నారు. సాగు, తాగు నీటికి ఎల్లప్పుడూ ఈ రెండు ప్రాంతాలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కృష్ణా పెన్నూరు దగ్గర పిల్లర్ లెస్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని నిన్న గడ్కరీ ట్వీట్ చేశారని బైరెడ్డి పేర్కొన్నారు. 11 వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ఈ బ్రిడ్జిపై ఎవరో తప్పుడు సలహా ఇచ్చారన్నారు. ఐకానిక్ బ్రిడ్జి వల్ల ఎవరికి మేలు జరగడం లేదన్నారు. అసలు దీని వల్ల రాయల సీమకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. రాయలసీమకు కావాల్సింది ఐకానిక్ బ్రిడ్జిలు కాదని... ప్రాజెక్ట్ లు , రిజర్వాయర్లు అని బైరెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2022-10-17T20:11:30+05:30 IST