ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్‌

ABN, First Publish Date - 2022-05-19T08:04:33+05:30

రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా్‌షచంద్రబోస్‌ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా తొలి డీఆర్‌సీ, నీటి సలహా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక బస్తాకు రూ. 200 దోచేస్తున్నారు

వైసీపీ ఎంపీ బోస్‌ సంచలన వ్యాఖ్యలు

4 ఎకరాల్లో రెండు ఎకరాలే రైతు పేరిట

మిగతాది వేరే వ్యక్తుల పేర్లతో నమోదు

నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి

సీఐడీ విచారణ జరపాలి: బోస్‌


రాజమహేంద్రవరం, మే 18 (ఆంధ్రజ్యోతి): రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద కుంభకోణం జరుగుతోందని  వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా తొలి డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైసు మిల్లర్లు దోచేస్తున్నారు. దీని వెనుక రైసుమిల్లర్లు, అధికారులు ఉంటారు. కానీ ఎక్కడా దొరకరు. ముందుగా  రైతుల వద్ద  దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయిస్తారు. అనంతరం మిల్లరు ఓ జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జత చేయిస్తున్నారు. ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాల రైతు పేర చూపి మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదుచేసి కనీసం ఒక్కో బస్తాకు రూ.200 దోచేస్తున్నారు.


దీనిపై నా వద్ద ఆధారాలు ఉన్నాయి. సీఎం జగన్‌ దృష్టికి కూడా తీసుకుని వెళతాను. సీబీసీఐడీ విచారణ చేయిస్తే కుంభకోణం బయటపడుతుంది. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కాకినాడ జిల్లాలో కూడా జరిగాయి. అవి కూడా సేకరిస్తున్నా’’నని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో దీనిపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఎంపీ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ మాట్లాడుతూ, ఈ క్రాప్‌ ద్వారా నమోదైన రైతుల పేర్లతో ఆర్బీకేలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, జిల్లాలో 17 వేల మంది వివరాలు దొరకడం లేదన్నారు. దీంతో ఎంపీ బోసు జోక్యం చేసుకుని... మరి అవి ఏమైనట్టు అని ప్రశ్నించారు. ‘‘ఇవన్నీ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారు. అదే నమోదు చేస్తారు. ఈ కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం అమ్మారనేది చాటింపు వేసి ఆరా తీస్తే అసలు సంగతి తేలుతుంది’’ అని ఎంపీ అన్నారు. జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ జోక్యం చేసుకుని.. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, రైతులందరికీ ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.


కాగా, బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సమర్థించారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, సాబ్జీ, అనంతబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా. జి. శ్రీనివాసనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జ్యోతుల చంటిబాబు, జడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాల్‌, కవురు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T08:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising