ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN : పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-07-19T18:38:46+05:30

పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లు(Global students)గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN) లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. మంగళవారం ‘‘మన బడి - నాడు నేడు’’ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఓ ఉన్నత పాఠశాలలో 44 లక్షలతో అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ధిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 కోట్లతో 28 ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ... ‘‘సీఎం జగన్ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం.‘‘మన బడి - నాడు నేడు’’ ద్వారా ఈ ఏడాది 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీ‌ల్లో 1,2 తరగతులు చెప్పే స్కూల్ టీచర్లు అందులో ఉంటారు. గతంలో ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్‌లను బోధించేవారు. ఈ అకడమిక్ సంవత్సరం నుంచి మూడోతరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారు.  పాఠశాలల్లో కొన్ని లోపాలను సరిదిద్దుతున్నాం.. భావి తరాలు మరింత అభివృద్ధి చెందాలి. పిల్లల చదువుల పట్ల రాజకీయాలు చేయడం మానుకోవాలి.. తల్లిదండ్రులు వారి ధ్యాసలో పడకుండా పిల్లల అభివృద్ధికి సహకరించాలి.కేరళ తరహాలో విద్యార్థులు ఉన్నత విద్యనందిపుచ్చుకొని రాణించాలనేదే ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-19T18:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising