ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Party శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని... అవి మంచిది కాదు: Botsa

ABN, First Publish Date - 2022-06-29T20:05:20+05:30

చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం : చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) భ్రమపడ్డారన్నారు. నియోజకవర్గం స్థాయిలో శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని... అవి పార్టీకి మంచిది కాదన్నారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘ఎల్లకాలం నేనే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వొచ్చు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి చేటు. నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదు. పట్టించుకోవలసిన అవసరం లేదు. వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఇది విమర్శ కాదు.. నేర్చుకో !(టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జునకి కౌంటర్). మీ అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ది చేసారో చెప్పు ముందు. నియంత రాజకీయాలు వద్దు. అందరూ కలసి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోండి. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు? 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను. వయసులు పెరిగిపోయాయి. ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఏమి చెప్తారు? ఉద్యోగులకు మళ్లీ ట్రైనింగ్ నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-29T20:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising