ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు పత్రాలూ బయటపెట్టాలి: రఘురామ

ABN, First Publish Date - 2022-08-20T10:42:50+05:30

ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ యజమాని జిమ్‌ స్టాఫర్డ్‌కు ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా వారు ఇచ్చిన వాస్తవ నివేదికను బయటపెట్టాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ యజమాని జిమ్‌ స్టాఫర్డ్‌కు ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా వారు ఇచ్చిన వాస్తవ నివేదికను బయటపెట్టాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆ రెండు పత్రాలకు మధ్య ఉన్న తేడా తెలిసిపోతే ఖేల్‌ఖ తం... దుకాణం బంద్‌ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ డర్టీ వీడియోపై టీడీపీ నాయకులు విడుదల చేసింది తప్పుడు నివేదికని ఎలా నిర్ధారిస్తారన్నారు. జిమ్‌ స్టాఫర్డ్‌ కార్యాలయ సిబ్బంది ఒరిజినల్‌ రిపోర్టులో ఒకటి, రెండు పదాలను మార్చి నివేదిక ఇచ్చి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధులకు సునీల్‌ కుమార్‌... ఒరిజినల్‌ నివేదిక ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాగా, ఎక్స్చేంజీలో విద్యుత్తు కొనుగోళ్లకు 24 గంటల వ్యవధిలో డబ్బులు చెల్లించాలని, అలాంటప్పుడు మూడేళ్ల 3 నెలల క్రితం పదవి నుంచి దిగిపోయిన చంద్రబాబుకు, ప్రస్తుత విద్యుత్తు కొనుగో లు బకాయిలకు సంబంధం ఏమిటో చెప్పాలని రఘురామ డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర విభజన అనంతరం రెండున్నరేళ్ల పాటు ప్రజలు విద్యుత్‌ కష్టాలను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, కానీ గత ప్రభుత్వ చివరి రెండున్నర ఏళ్లలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. 

Updated Date - 2022-08-20T10:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising