ఇది చాలా సున్నితమైన అంశం: బొత్స
ABN, First Publish Date - 2022-04-29T20:26:54+05:30
ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు.
అమరావతి : ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. నంద్యాలలోను పేపర్ బయటకు రావడం అనేది ఒట్టి పుకారు మాత్రమేనన్నారు. సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఇందులో ఏం జరిగిందనే దానిపై అరగంటలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘మీడియాలో 10 గంటలకే బయటకు వచ్చింది అంటున్నారు. వాస్తవాలు ఏంటో ఎంక్వైరీ చేస్తాం. టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత ఒకరి కోసమో ఇద్దరి కోసమో, ఒక రూంలోని వారి కోసమో కుట్రతో చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిని ప్రైవేటు కాలేజీలకు ఆపాదించలేము. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా సరే వారిని అదుపులోకి తీసుకుంటాం. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2022-04-29T20:26:54+05:30 IST