ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma : కాపు నేతల సమావేశమంటూ వస్తున్న వార్తలపై ఫైర్

ABN, First Publish Date - 2022-12-15T13:26:56+05:30

విజయవాడలో కాపు నేతల సమావేశం అంటూ వస‌్తున‌్న వార‌్తలపై బోండా ఉమా ఫైర్ అయ్యారు. కొన్ని ఛానల్స్ స్నేహపూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bonda Uma : విజయవాడలో కాపు నేతల సమావేశం అంటూ వస‌్తున‌్న వార్తలపై బోండా ఉమా ఫైర్ అయ్యారు. కొన్ని ఛానల్స్ స్నేహపూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది సాధారణ సమావేశం మాత్రమేనని.. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా మాత్రమే తాము కలిశామన్నారు. కుటుంబ వ్యవహారాలు, ఒక్కొక్కరి యోగ క్షేమాలు మాత్రమే సమావేశంలో చర్చించుకున్నామన్నారు. వైజాగ్‌లో కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చకు రాలేదని బోండా ఉమ వెల్లడించారు. 26వ తేదీన వైజాగ్‌లో రంగా వర్ధంతి‌కి సంబంధించిన పోస్టర్‌లను మాత్రమే గంటా ఆవిష్కరించారన్నారు. పార్టీ మారే అంశంపై గతంలోనే గంటా ఖండించారని తమతో చెప్పారని బోండా ఉమా పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను సైతం నాదెండ్ల మనోహర్‌తో ఉన్న సంబంధాలు నేపథ్యంలోనే కలిశామని చెప్పారు. కాపు నాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదని... అందిరితో కూడుకున్న అంశమన్నారు. 26వ తేదీన రంగా వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నామని.. కాపు నాడు సభ మాత్రం కాదన్నారు. కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసింది ఒక్క టీడీపీయేనని.. కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని బోండా ఉమ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T13:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising