ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma : చెల్లెలికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా సైకో జగన్‌కి లేదు

ABN, First Publish Date - 2022-09-24T17:45:42+05:30

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్సార్ పేరు మార్పు (YSR Name Change)పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ (Bonda Uma) ధర్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్సార్ పేరు మార్పు (YSR Name Change)పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ (Bonda Uma) ధర్నా చౌక్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించాలన్నారు. వైఎస్సార్ పేరు పెట్టుకోవాలంటే కొత్త హాస్పిటల్స్ కట్టి పేరు పెట్టుకోమని సూచించారు. 1986లో ప్రజలకి వైద్యం అందించే దిశగా స్వర్గీయ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.


ఇంకా బోండా ఉమ మాట్లాడుతూ.. ‘‘జగన్ చెల్లెలు షర్మిల (YS Sharmila) స్వయంగా పాదయాత్రలో పేరు మార్పుపై ఖండించారు. తన చెల్లెలికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా సైకో జగన్‌ (Psycho Jagan)కి లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోరాడుతాం. అమరావతి రాజధాని రైతులకు అడుగడుగునా నీరాజనాలు పట్టడం జగన్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జగన్ పతనం ప్రారంభమైంది’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-09-24T17:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising