ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి: సత్యకుమార్

ABN, First Publish Date - 2022-05-27T03:38:36+05:30

రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. రథాలను దగ్ధం చేయడాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. రథాలను దగ్ధం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మతిస్థిమితం లేని వారు చేశారని కేసును మూసేయడం దారుణమని సత్యకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో హనుమాన్ శోభా యాత్రని నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని గడపగా ఉన్న కడప పేరును వై.ఎస్.ఆర్.గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  గడప గడపకూ ప్రభుత్వ తీరుపై నేతలని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు అమలాపురం ఘటనని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.  అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తున్నారని, అమరావతిలో ఎందుకు అంబేడ్కర్ విగ్రహం పనులు జరగడం లేదని ప్రశ్నించారు. బీసీ సామాజిక యాత్ర కేవలం ఓట్ల కోసమేనని,  బీసీల పేరుతో మోసం చేస్తున్నారని.. దావోస్ పర్యటనలో ఒక్క పైసా కూడా రాలేదని.. హాలిడే ట్రిప్‌లా ఉందన్నారు. 


Updated Date - 2022-05-27T03:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising