ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీజీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-07-19T01:48:38+05:30

ఢిల్లీ: ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్  జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని సీఎం ఇచ్చిన  హామీని వారు గుర్తు చేశారు. ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరతామని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే  తెలిపారు.  


కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా.. మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరిక వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది. కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు గల్లంతయ్యారు. 

Updated Date - 2022-07-19T01:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising