ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vishnuvardhan reddy: ప్రాజెక్ట్‌ల విషయంలో జగన్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు

ABN, First Publish Date - 2022-08-17T18:38:15+05:30

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని... అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని... అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి (Vishnuvardhan reddy) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్‌‌(Jagan government)కు చిత్తశుద్ధి లేదన్నారు. రివర్స్ టెండర్లు పేరుతో  కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా.. రైతులకు ద్రోహం చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసిందా అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రంపై నెట్టి తప్పించుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. రహదార్ల నిర్మాణాలకు సంబంధించి, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీమకు ద్రోహం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. భవిష్యత్లో త్రాగునీటి కోసం బీజేపీ నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు రాష్ట్రాలకు ప్రమాదమన్నారు. వారసత్వ పార్టీలు పోతేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీజేపీ, జనసేన (Janasena)తో కలిసి పని చేస్తుందన్నారు. రాయలసీమలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-17T18:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising