ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో లేని బస్సు ఛార్జీలు పెంపు... ఏపీలో మాత్రమే ఎందుకు?: Vishnu vardhan

ABN, First Publish Date - 2022-01-07T19:32:52+05:30

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణలో లేని బస్సు ఛార్జీల పెంపు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రి జగన్ గారు ?.. వారివి మాత్రం బస్సులు కావా? వారు వాడేది డీజిల్ కాదా!... మీ ప్రభుత్వం మద్యం ధరలు, సినిమా టికెట్ల రేట్లలో చూపించిన శ్రద్ధ, పేద ప్రయాణికుల బస్సు ఛార్జీల విషయంలో ఎందుకు చూపించడం లేదు?... చిన్న సినిమాను, పెద్ద సినిమాను ఒకేలా చూసిన వారు, సాధారణ బస్సులను, ప్రత్యేక బస్సులను ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నారు? పండుగ బస్సుల్లో 50 శాతం రేట్ ఎందుకు ఎక్కువ?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-07T19:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising