ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కృష్ణానది ఘాట్, పరిసరాల ప్రాంతాలను శుభ్రం చేసిన సోమువీర్రాజు

ABN, First Publish Date - 2022-09-28T15:26:05+05:30

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది ఘాట్, పరిసర ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బుధవారం ఉధయం శుభ్రం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది ఘాట్, పరిసర ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu veerraju) బుధవారం ఉధయం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు (BJP Leader) మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Modi) జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ వరకు బీజేపీ (BJP) వివిధ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. స్వచ్చ భారత్ (swachh bharat) సందర్భంగా నదుల శుభ్రత కార్యక్రమం చేపట్టామన్నారు. మెడికల్ క్యాంపులు పెట్టామని, రెండు లక్షల మంది రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారని తెలిపారు. 2024 నాటికి దేశంలో టి.బి.రోగులు ఉండకూడదనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణానదీ తీర ప్రాంతాన్ని శుభ్రం చేశామని తెలిపారు. రాష్ట్రంలో విభజన సమస్యలపై ఇటీవల ఢిల్లీ (Delhi)లో ఒక సమావేశం జరిగిందని...  రెండు తెలుగు రాష్ట్రాల (Telugu state) మధ్య విభజనలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. నేడు రైల్వే జోన్(Railway zone) ఇవ్వడం లేదనే అంశాన్ని  వివాదాస్పదంగా మార్చారని అన్నారు. అసలు రైల్వేజోన్‌కు తెలంగాణ (Telangana)కు సంబంధం లేదని, అయినా రాజకీయ కారణాలతో అజెండాలో చేర్చారన్నారు. ఇటువంటి అంశాలను చర్చకు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైల్వే జోన్‌కు ఏపీ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిందని, డీపీఆర్ తయారైందని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం (AP Government) తరపున రైల్వో జోన్ పనులకు కొంత భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే రైల్వే జోన్‌కు సంబంధించిన పనులు  జరుగుతున్నాయన్నారు. పేపర్లో మాత్రం ఈ అంశాలకు విరుద్ధంగా నరేంద్రమోదీ(Prime minister)ని అన్ పాపులర్ చేసేలా కథనాలు రాశారని మండిపడ్డారు. చాలామంది పెద్దలు చక్రాలు తిప్పారని, దేశంలో ప్రధానులనే మార్చిన వారని.. రైల్వే జోన్ గురించి ఆనాడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను..  నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉండి ప్రధానులను మార్చిన వ్యక్తికి అడిగే దమ్ముందా అంటూ నిలదీశారు. తాము రైల్వే జోన్ తీసుకువస్తుంటే.. తమపై బురద జల్లేలా వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయపరమైన నిర్ణయం, రైల్వేజోన్ అంశం రెండు రాష్ట్రాలకు చెందిన సమస్యే కానే కాదని సోమువీర్రా (BJP state presidents) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీరామ్, నాగభూషణం, బాల, ఉమామహేశ్వరాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T15:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising