ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్టులపై ఏపీ సర్కార్‌కు దశదిశ లేదు: Somuveerraju

ABN, First Publish Date - 2022-04-09T19:21:01+05:30

రాష్ట్రంలో ప్రాజెక్టులపై ఏపీ సర్కార్‌కు దశదిశ లేదని... అందుకే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై ఏపీ సర్కార్‌కు దశదిశ లేదని... అందుకే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి రూ.55 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రం ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు రూపాయి కూడా ఖర్చుపెట్టని జగన్‌ వేల కోట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. వంశధార, మడ్డువలసలో నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగలేదన్నారు. ఎచ్చెర్లలో 30 లక్షలు కూడా కేటాయించుకోలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను మోదీ పూర్తి చేస్తారని ఆయన తెలిపారు. ‘‘మైనర్ ఇరిగేషన్ మంత్రి లేడు‌, బడ్జెట్‌ లేదు.. అందుకే అన్నమయ్య ప్రాజెక్ట్ దెబ్బతిన్నది’’ అని అన్నారు. నిస్సిగ్గుగా గంగవరం పోర్ట్‌లో 10 శాతం వాటా అదానీకి అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరెంట్‌ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సోలార్ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-09T19:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising