ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే కోటంరెడ్డివి బురద రాజకీయాలు: Anjaneya reddy

ABN, First Publish Date - 2022-07-05T17:31:48+05:30

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy sridhar reddy) బురద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి (Anjaneya reddy) విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి బురదలో దిగడం ఏమిటి? అని ప్రశ్నించారు. అణువణువుని రాజకీయంగా మలుచుకోవడంలో శ్రీధర్ రెడ్డిని‌ మించిన నాయకుడు లేడని ఆంజేయరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 


కాగా... రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మురుగునీటి కాలువలోకి దిగిన విషయం తెలిసిందే. 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించానన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.


Updated Date - 2022-07-05T17:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising