ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నప్రసాదాలకు బయోడిగ్రేడబుల్‌ ప్లేట్లు, గ్లాసులు

ABN, First Publish Date - 2022-07-03T09:13:10+05:30

అన్నప్రసాదాలకు బయోడిగ్రేడబుల్‌ ప్లేట్లు, గ్లాసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ ప్రతిపాదన మేరకు రూపకల్పన : డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి

తిరుమల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘పవిత్రమైన తిరుమల వాతావరణం కలుషితం కాకుండా చేయడం మా ధర్మం’ అని డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి అన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన లడ్డూకౌంటర్‌ వద్ద డీఆర్డీవో ఆధ్వర్యంలో నడుస్తున్న బయోడిగ్రేడబుల్‌ కవర్ల విక్రయకేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో భక్తులు లడ్డూలను తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్‌ బ్యాగులను వినియోగించేవారన్నారు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న క్రమంలో టీటీడీ సహకారంతో మూడునెలల్లో వాతావరణంలో కలిసిపోయేలా డీఆర్డీవో ఆధ్వర్యంలో బయోడిగ్రేడబుల్‌ బ్యాగులను ప్రవేశపెట్టామన్నారు. ప్రస్తుతం తిరుమలలో అందరూ ఈ బ్యాగులను వినియోగిస్తున్నారని తెలిపారు. అన్నప్రసాద భవనంలో వినియోగించే ప్లేట్లు, గ్లాసులు కూడా బయోడిగ్రేడబుల్‌ చేస్తే బాగుంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారని, ఆ పనిలో తమ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు. కొద్దిరోజుల్లోనే తాము తయారుచేసిన వాటిని తిరుమలకు తీసుకువచ్చి టీటీడీకి చూపిస్తామన్నారు. టీటీడీ  వాటిని అంగీకరిస్తే ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

Updated Date - 2022-07-03T09:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising