ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎఫ్ఎస్సీ ప్రవేశ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2022-12-09T03:00:52+05:30

ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ పరిధిలోని ముత్తుకూరు మత్స్య కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌(బీఎఫ్ఎస్సీ 2022-23)లో చేరేందుకు వెబ్‌కౌన్సెలింగ్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీకి 29, తెలంగాణకు 11 సీట్లు

అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ పరిధిలోని ముత్తుకూరు మత్స్య కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌(బీఎఫ్ఎస్సీ 2022-23)లో చేరేందుకు వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపికైన 40మంది అభ్యర్థుల జాబితాను మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో మత్స్య విశ్వవిద్యాలయ లోగోను ఇన్‌చార్జి వీసీ వై.మధుసూదన్‌రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 12వేల మంది ఫిషరీస్‌ డిప్లొమా హోల్డర్లు, 6వేలపైన బీఎ్‌ఫఎస్సీ, 2,500మంది ఎంఎ్‌ఫఎస్సీ గ్రాడ్యుయేట్లు అవసరముందని చెప్పారు. ముత్తుకూరు మత్స్య కళాశాలలోని 40 సీట్లలో 29 ఏపీకి, 11తెలంగాణకు కేటాయించినట్లు రిజిస్ర్టార్‌ సుధాకర్‌ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా ఫీజులు చెల్లించి, కళాఽశాలలో చేరాలని, 17న రెండో కౌన్సిలింగ్‌ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-09T03:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising