ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో బీసీ సంఘం ధర్నా

ABN, First Publish Date - 2022-12-15T03:53:13+05:30

‘పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’’ అని జాతీయ బీసీ సంఘం డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’’ అని జాతీయ బీసీ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం ఆ సంఘం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యు డు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. ‘‘75 కోట్ల మంది జనాభా గల బీసీలను బిచ్చగాళ్లను చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో తిరుగుబాటు జరుగుతుంది’’ అని కృష్ణయ్య హెచ్చరించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందన్నారు.

Updated Date - 2022-12-15T03:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising