కాలానికి తగ్గ రచనలు జరిగినప్పుడే సాహిత్యానికి విలువ
ABN, First Publish Date - 2022-10-17T10:01:54+05:30
భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వానికి విలువ ఇచ్చినప్పటికీ.. సమాజంలో వాటికి విలువ లభించలేదని, కాలానికి తగ్గట్లుగా సమాజంలో వస్తున్న
ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు
శాంతిశ్రీ బెనర్జీ పుస్తకాల ఆవిష్కరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వానికి విలువ ఇచ్చినప్పటికీ.. సమాజంలో వాటికి విలువ లభించలేదని, కాలానికి తగ్గట్లుగా సమాజంలో వస్తున్న మార్పులకు, నేటితరం అభిప్రాయాలకు అనుగుణంగా రచనలు జరిగినప్పుడే సాహిత్యానికి విలువ ఏర్పడుతుందని ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ఎడిటర్ ఎ.కృష్ణారావు అన్నారు. ప్రముఖ రచయిత్రి శాంతిశ్రీ బెనర్జీ రచించిన క థల సంపుటి మానుషి, కవితల సంకలనం ఆలంబనను ఆదివారంనాడిక్కడ ఆంరఽధా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న దారుణాలన్నింటిని జర్నలిస్టులు చిత్రించలేరని, శాంతిశ్రీలాంటి రచయితలు తమ కథలు, కవితల ద్వారా వాటికి అద్భుతంగా న్యాయం చేస్తారని ఆయన అన్నారు. నెహ్రూ హయాంలో అన్యాయానికి గురైన సంతాలీ స్త్రీ బుధిని, లాక్‌డౌన్ సమయంలో 500 మైళ్లు తండ్రిని సైకిల్ ఎక్కించుకుని తొక్కిన యువతి అనుభవాలను శాంతిశ్రీ మనసులకు హత్తుకునే కథలుగా మలిచారని ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ గంపా వెంకట్రామయ్య పేర్కొన్నారు. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, రచయితలు శాంతాదేవి, సత్తిరాజు పద్మ, పత్తిపాక మోహన్, జేఎల్ రెడ్డి, దేవరకొండ సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T10:01:54+05:30 IST