ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలు విగ్రహాన్ని పునరుద్ధరించాలి: టీడీపీ

ABN, First Publish Date - 2022-10-07T08:50:49+05:30

బాలు విగ్రహాన్ని పునరుద్ధరించాలి: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రభుత్వమే పునరుద్ధరించాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ డిమాండ్‌ చేశారు. గుంటూరు మదర్‌ థెరిస్సా సెంటరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ తొలగించి.. మరుగుదొడ్డి వద్ద పెట్టడం ఆ మహనీయుడిని ఘోరంగా అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. ‘‘బడుగు వర్గాల కోసం పాటుపడిన బీపీ మండల్‌ విగ్రహాన్ని కూడా ఇలాగే తొలగించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం సంగీతాభిమానులు, కళాకారుల హృదయాల్ని గాయపరిచేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలకొద్దీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి విగ్రహాలన్నింటికీ అనుమతులు ఉన్నాయా?’’ అని రఫీ నిలదీశారు. 


Updated Date - 2022-10-07T08:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising