ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఉరిశిక్ష

ABN, First Publish Date - 2022-04-29T20:45:08+05:30

గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. న్యాయమూర్తి రాంగోపాల్ తుది తీర్పు వెలువరించారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ తర్వాత క్రమంలో తన నెంబర్ బ్లాక్ చేసిందనే కారణంతో కక్షపెంచుకున్నాడు. చివరకు గత ఏడాది ఆగష్టు 15న గుంటూరు జిల్లా పరమయ్యకుంటలో రమ్యను హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఘటనా స్థలంలోనే శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల పాటు కేసు విచారణ సాగింది. మొత్తం 28 మంది సాక్షులను న్యాయస్దానం విచారించింది. 


మరోవైపు దిశ చట్టం ద్వారా తమకు న్యాయం జరిగిందని రమ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసులకు రమ్య తండ్రి నల్లా వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉన్మాదులకు ఉరే సరియైన శిక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. 


తన కుమారుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించడంపై అతడి తల్లి భూలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. తమకు తినడానికి తిండి కూడా లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

Updated Date - 2022-04-29T20:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising