ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అప్పులు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: అయ్యన్న

ABN, First Publish Date - 2022-07-28T01:22:33+05:30

ఐదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అప్పులు, రాష్ట్ర అభివృద్ధి.. మూడున్నరేళ్ల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఐదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అప్పులు, రాష్ట్ర అభివృద్ధి.. మూడున్నరేళ్ల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు, అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ (jagan) పాలన తుగ్లక్‌ని తలపిస్తోందన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ (Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్‌, తితలీ లాంటి భీకర తుఫాన్లు వచ్చాయని, అటువంటి సమయంలోనూ చంద్రబాబు (Chandrababu) నిరంతరం శ్రమించి తొందరగా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించారని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.

Updated Date - 2022-07-28T01:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising