ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Garlapati Venkatesh మెడికల్ రిపోర్టు తారుమారుకు యత్నం

ABN, First Publish Date - 2022-07-01T16:45:31+05:30

జిల్లాలోని జీజీహెచ్‌లో హైడ్రామా నెలకొంది. సోషల్ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన గార్లపాటి వెంకటేష్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టు‌ను తారుమారు చేసేందుకు పోలీసు పెద్దలు, ప్రైవేటుఆస్పత్రి నిర్వాహకులు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని జీజీహెచ్‌(GGH)లో హైడ్రామా నెలకొంది. సోషల్ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన గార్లపాటి వెంకటేష్‌(Garlapati venkatesh)కు సంబంధించి మెడికల్ రిపోర్టు‌ను తారుమారు చేసేందుకు పోలీసు పెద్దలు, ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు యత్నించారు. జీజీహెచ్‌లో వెంకేటష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు(CID police) కొట్టడంతో వెంకటేష్ గాయపడ్డాడు. వెంకటేష్‌కు ఎముక విరిగినట్లు వైద్య పరిక్షలలో వెల్లడైంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు పెద్దలు, పలు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు... సీఐడీకి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు జీజీహెచ్ కేసులలో ఏం పని అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కాగా... ధరణికోటలో టీడీపీ(TDP) సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్న గార్లపాటి వెంకటేష్‌ను సీఐడీ పోలీసులు నిన్న(గురువారం)అదుపులోకి తీసుకున్నారు. యూటూబ్ చానల్‌ను నడుపుతున్న వెంకటేష్.. సీఎం జగన్(Jagan), వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గోడదూకి మరీ ఇంట్లోకి ప్రవేశించిన సీఐడీ పోలీసులు... ఇంటి గడియ పగులగొట్టి లోపలకు వచ్చారు. మొత్తం దృశ్యాలను వీడియో తీస్తుండడంతో పోలీసులు లైట్లు పగులగొట్టారు. వెంకటేష్‌ను అరెస్ట్ చేసి... కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-07-01T16:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising