ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchennaidu: బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేత ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట

ABN, First Publish Date - 2022-09-29T19:48:11+05:30

బీసీల అభ్యుదయ సారధి బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): బీసీల అభ్యుదయ సారధి బిపి మండల్ (BP Mandal) విగ్రహ దిమ్మె కూల్చివేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan reddy) అహంకారానికి బీసీలంతా ఏకమై సమాధి కట్టబోతున్నారని అన్నారు. విగ్రహం కూల్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని కూల్చలేరని అన్నారు. అధికార పార్టీలో ఉంటూ బీసీలపై దాడులను ప్రభుత్వాన్ని నిలదీసిన ధీశాలని, మైనార్టీలు, దళితులపై పోలీసుల అరాచకాన్ని ఎదురించిన బడుగుల బాంధవుడు బిపి మండల్ అని కొనియాడారు. పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా బడుగులకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేతతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను జగన్ రెడ్డి అవమానించారని, కనీస సమాచారం ఇవ్వకుండా విగ్రహ దిమ్మెను కూల్చాల్సిన అవసరం ఏంటని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

Updated Date - 2022-09-29T19:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising