ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchennaidu: ఈ ఏడాది నమోదైనన్ని డెంగ్యూ కేసులు.. చరిత్రలో నమోదవలే..

ABN, First Publish Date - 2022-09-20T17:18:36+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhrapradesh State)లో అంటు వ్యాధులు లేవు అని చెపుతున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhrapradesh State)లో అంటు వ్యాధులు లేవు అని చెపుతున్నారని.. అయితే నిత్యం పేపర్‌లలో జ్వరాల ద్వారా చనిపోతున్నారని వింటూనే ఉన్నామని అసెంబ్లీ(AP Assembly)లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchennaidu) పేర్కొన్నారు. ‘మంత్రిగారు సభకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మంత్రి గారు పట్టణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగాల గురించి తెలుసా?’ అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం నమోదు అయినన్ని డెంగ్యూ కేసులు(Dengue cases).. చరిత్రలో ఎప్పుడూ నమోదు కాలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 


డెంగ్యూ వ్యాధి వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని.. లోకల్‌గా వైద్యం చేయించుకున్నాక పరిస్థితి విషమించి చాలా మంది చనిపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల(Government Hospitals)లో ఎక్కడా ల్యాబ్‌లు పనిచేయడం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ(Arogya Sri)లో చూపించుకోవాలని అంటున్నారని వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల(Private Hospitals)కు వెళితే అక్కడ పాత బకాయిలు ఇవ్వలేదని వారు వైద్యం చేయడం లేదన్నారు. పేదలకు డెంగ్యూ(Dengue) వస్తే ప్లేట్ లెట్స్ పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


Updated Date - 2022-09-20T17:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising