ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డెక్కగానే ఈడ్చేశారు..!

ABN, First Publish Date - 2022-03-16T09:06:31+05:30

సమస్య చెప్పుకొనే అవకాశం లేదు.. అన్యాయంపై ప్రశ్నించే పరిస్థితి అంతకన్నా లేదు.. రోడ్డెక్కితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. ఇదీ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి! తాజాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌(వీవోఏ)లు ప్రభుత్వ తీరుకు నిరసనగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడలో వెలుగు యానిమేటర్ల అరెస్టు..

తోపులాటలో సంఘ నాయకురాలికి గాయాలు

నిరసన తెలిపిన అంగన్‌వాడీలదీ అదే పరిస్థితి..

పోలీసుల తీరుపై ఆందోళనకారుల నిరసన


విజయవాడ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): సమస్య చెప్పుకొనే అవకాశం లేదు.. అన్యాయంపై ప్రశ్నించే పరిస్థితి అంతకన్నా లేదు.. రోడ్డెక్కితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. ఇదీ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి! తాజాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌(వీవోఏ)లు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. అంగన్‌వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు, వీవోఏలు చలో విజయవాడ కార్యక్రమాలకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే.. ఇరువర్గాల ఆందోళనలను పోలీసులు అణిచి వేశారు. 




అరెస్టులు.. నిర్బంధాలు!

వీవోఏ మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’కు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. వీవోఏలను అరె స్టు చేసి వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. వెలుగు ప్రాజెక్టులో 27,500 మంది యానిమేటర్లు, 8500 రిసోర్స్‌ పర్సన్లు పనిచేస్తున్నారు. వారిలో కొంతమంది సోమవారం రాత్రికే విజయవాడకు చేరుకున్నారు. కొందరు బస్సులు, కారుల్లో బయలుదేరగా, విజయవాడ ఎంట్రన్స్‌ వద్ద ఉన్న చెక్‌పోస్టుల వద్ద అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లకు వచ్చినవారిని అరెస్టుచేశారు. రాఘవయ్యపార్కు వద్ద ఉన్న యూటీఎఫ్‌ భవనం నుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చిన వీవోఏలను భారీగా మోహరించిన పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు.  మొత్తంగా 1000 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలో వీవోఏల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్‌ రూపాదేవి తీవ్రంగా గాయపడ్డారు. 


అంగన్‌వాడీలపై బైండోవర్‌ కేసులు

సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ వర్కర్లు విజయవాడ ధర్నాచౌక్‌లో రిలే నిరాహార దీక్షలకు దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే.. విజయవాడ పోలీసులు అనుమతి తిరస్కరించారు. అయినప్పటికీ.. ధర్నాచౌక్‌కు అంగన్‌ వాడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులందరి పైనా 151 సీఆర్‌పీసీ ప్రకారం బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

Updated Date - 2022-03-16T09:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising