ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు జగన్‌, కేసీఆర్‌ ఎందుకు కలవరు?

ABN, First Publish Date - 2022-03-05T08:12:55+05:30

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

దేవరకొండ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం ఎందుకు కలిసి వెళ్లడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో  శుక్రవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వతరెడ్డి వర్ధంతి సభకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధమని చెప్పారు.  బీజేపీ మత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్‌ వ్యాపారానికి సన్నాహాలు జరిగాయని ఆరోపించారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వాన్ని ముందుగా అప్రమత్తం చేసినట్లయితే అక్కడి మన విద్యార్థులను మన దేశానికి తీసుకువచ్చే అవకాశం ఉండేదన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వతరెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. 1962లో పెద్దవూర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన పర్వతరెడ్డి  1964లో అదనపు శిస్తు విధింపునకు వ్యతిరేకంగా 60 రోజులు జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి, శిస్తు తగ్గించేవరకూ పోరాటం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated Date - 2022-03-05T08:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising