ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ షరతుల అమలుపై నివేదిక అడుగుతాం

ABN, First Publish Date - 2022-03-05T08:04:15+05:30

పోలవరం ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతుల్లోని షరతుల అమలుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఉత్తర్వులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోలవరంపై ఎన్‌జీటీ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతుల్లోని షరతుల అమలుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేస్తామని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) వెల్లడించింది. షరతులను అమలు చేయడం లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం  కొనసాగిస్తూనే ఉందన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రాధాన్యంగా భావిస్తున్నారని, భద్రతాచర్యలపై దృష్టి సారించడం లేదని వివరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అనగా.. షరతుల అమలు నివేదిక అందించాలని ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.

Updated Date - 2022-03-05T08:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising