ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జీలను దూషించిన కేసులో.. ముగ్గురు నిందితులకు సీబీఐ కస్టడీ

ABN, First Publish Date - 2022-02-16T07:33:58+05:30

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన కేసులో ఇటీవల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేటి నుంచి 2 రోజుల విచారణకు కోర్టు అనుమతి 

గుంటూరు(లీగల్‌), ఫిబ్రవరి 15: న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన కేసులో ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను దర్యాప్తు సంస్థ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టులో ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌ మెట్ట చంద్రశేఖర్‌, సీనియర్‌ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గుంట రమేశ్‌కుమార్‌లను రెండ్రోజులపాటు విచారించేందుకు సీబీఐకి అనుమతిస్తూ గుంటూరు సీబీఐ కోర్టు ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌ పొన్నూరు బుజ్జి మంగళవా రం ఆదేశాలిచ్చారు. వీరిని అరెస్టు చేసి గత శనివారం రాత్రి కోర్టులో హాజరుపరచగా.. వారికి ఈ నెల 25 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దూషణలు, పోస్టింగుల వ్యవహారంలో చోటు చేసుకున్న భారీ కుట్ర వెనుక వాస్తవాలను ఈ ముగ్గురూ తమ విచారణలో వెల్లడించలేదని సీబీఐ రిమాం డ్‌ రిపోర్టులో పేర్కొంది. ఆ కుట్రను వెలుగులోకి తేవాలంటే వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని కోర్టుకు విన్నవించిం ది. సీబీఐ వేర్వేరుగా మూడు కస్టడీ పిటిషన్లు దాఖలు చేసిం ది. వాటిపై మంగళవారం వాదనలు ఆలకించిన మేజిస్ట్రేట్‌.. బుధవారం ఉదయం 10.30 నుంచి రెండ్రోజులపాటు తమ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - 2022-02-16T07:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising