ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి ఓటు వేయలేదని.. పింఛను వేరే జిల్లాలకు బదిలీ

ABN, First Publish Date - 2022-01-04T08:51:02+05:30

ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదనే నెపంతో పింఛన్లను వేర్వేరు జిల్లాలకు మార్చిన ఘట న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శావల్యపురం మండ లం వయ్యకల్లు గ్రామానికి చెంది న కోణిదెన ఏడుకొండలు, ఆలూరి వెంకట్రావు, గోనుగుంట్ల చినవెంకటేశ్వర్లు, కర్రి ఈశ్వరవాణి తమ గ్రామ సర్పంచ్‌ జీ వెంకటేశ్వర్లుతో కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు కలెక్టరేట్‌లో 

 బాధితుల ఫిర్యాదు

గుంటూరు (తూర్పు), జనవరి 3: ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదనే నెపంతో పింఛన్లను వేర్వేరు జిల్లాలకు మార్చిన ఘట న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శావల్యపురం మండ లం వయ్యకల్లు గ్రామానికి చెంది న కోణిదెన ఏడుకొండలు, ఆలూరి వెంకట్రావు, గోనుగుంట్ల చినవెంకటేశ్వర్లు, కర్రి ఈశ్వరవాణి తమ గ్రామ సర్పంచ్‌ జీ వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. తొలి నుంచి గ్రామంలోనే పింఛన్‌ తీసుకుంటున్న తమకు డిసెంబరులో ఇవ్వలేదన్నారు. స్థానిక సచివాలయంలో ప్రశ్నిస్తే.. తిరుపతయ్య అనే ఉద్యోగి పింఛన్లు ఇతర జిల్లాల సచివాలయాల్లో నమోదైనట్టు చెప్పారన్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్న వెంకట్రావు పేరును తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం-2 సచివాలయానికి మార్చారని, ఏడుకొండలును కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల-2కి, చినవెంకటేశ్వర్లు పేరు కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్లమూడికి, వితంతు పింఛన్‌ తీసుకుంటున్న ఈశ్వరవాణి పేరు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మన్నెసుల్తానపాలేనికి మార్చారని, అక్కడికే వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరుతో పాటు జనవరి పింఛన్‌ కూడా వారికి ఇవ్వలేదని, మరో నెల అందకపోతే పూర్తిగా రద్దయ్యే ప్రమాదముందని సర్పంచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు అంతదూరం వెళ్లి పింఛన్లు ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. గ్రామంలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అధికార పార్టీ వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. ఉన్నాతాధికారులు స్పందించి బాధితులకు గ్రామంలోనే పింఛన్‌ ఇప్పించాలని కోరారు.

Updated Date - 2022-01-04T08:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising