ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలి: విద్యాసాగర్

ABN, First Publish Date - 2022-01-19T02:52:18+05:30

ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటివరకు 11 పీఆర్సీలు తీసుకున్నాయని ఏపీఎన్జీవో కృష్ణా, పశ్చిమ శాఖ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. 11వ పీఆర్సీ 70 సంవత్సరాలలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటివరకు 11 పీఆర్సీలు తీసుకున్నాయని ఏపీఎన్జీవోస్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు.  11వ పీఆర్సీ 70 సంవత్సరాలలో ఇప్పటివరకు ఎప్పుడు ఇటువంటి పీఆర్సీ చూడలేదన్నారు. ఐ‌ఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించి ఇవ్వడం ఇప్పటివరకు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


‘‘ప్రభుత్వం అన్ని ఇస్తాం అని చెప్పి అర్ధరాత్రి జీవో‌లు ఇచ్చారు.. పీఆర్సీ అంటే ఉద్యోగికి పండగ ,కానీ రాత్రి జీవో చూశాక ఉద్యోగులకు కంటిపై కునుకు లేదు. గత ప్రభుత్వాలు వద్ద పోరాడి సాధించుకున్న వాటిని రద్దు చేసింది. ఇవాళ జరుగుతున్న ప్రహసనం, ఇప్పటివరకు ముందెన్నడూ చూడలేదు. సంఘాలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తోంది. ఇక పీఆర్సీ పది సంవత్సరాకోసారి మాత్రమే అని చెప్పడం దుర్మార్గం. వేతన సవరణ అనేది రూపాయి విలువపై ఆధారపడి ఇచ్చేది, ఖర్చులు పెరుగుతున్నాయి. తక్షణమే పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. కాంట్రాక్ట్ ఔటసోర్స్ ఉద్యోగులకు పెంచిన వేతనంపై ఈ పీఆర్సీ అమలు చేస్తే ఏ రకంగా జీవిస్తారు. అన్ని జేఏసీ ఏకతాటిపైకి రావాలి. సాధించుకున్న వాటిని కూడా ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడం సరికాదు. ఐక్య పోరాటాలే హక్కులను కాపాడుతాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. హక్కులను సాధించేవరకు పోరాటం చేస్తాం.’’ అని ఏపీఎన్జీవో కృష్ణా, పశ్చిమ శాఖ అధ్యక్షుడు విద్యాసాగర్ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-19T02:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising