ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ విట్‌లో 25 మందికి సన్మానం

ABN, First Publish Date - 2022-01-27T08:43:39+05:30

ఏపీ-విట్‌ యూనివర్సిటీలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాంప్‌సలో ఘనంగా గణతంత్ర వేడుకలు


ఏపీ-విట్‌ యూనివర్సిటీలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఽ ది నిర్వహణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్‌ మధు, కానిస్టేబుల్‌ కే శ్రీనివాసరావు కుటుంబసభ్యులను ఘనంగా సత్కరించి చెరో రూ. 25వేలు చొప్పున అందజేశారు. అలాగే విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించిన మరో ఆర్టీసీ డ్రైవ ర్‌, కండక్టర్‌, 11 మంది పోలీస్‌ సిబ్బంది, 10 మంది అగ్నిమాపక సిబ్బందితో కలిపి మరో 23 మందిని సన్మానించారు. వారికి ప్రశంసా పత్రంతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు అందించారు. అలాగే 2021 బ్యాచ్‌కు చెందిన కొంతమంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టా్‌పలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌తోపాటు వీసీ డాక్టర్‌ ఎస్‌వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీఎల్‌వీ శివకుమార్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనుపమ నంబూరు  పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T08:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising