ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మూడు’కు మద్దతు పలుకుదాం!

ABN, First Publish Date - 2022-10-17T09:25:07+05:30

ఏపీ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎన్జీవో) అంతర్గత సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీఎన్జీవో హోంలో ఆదివారం జరిగింది. మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఎన్జీవో సంఘం నిర్ణయం?

నేడో, రేపో అధికారిక ప్రకటన

తాడేపల్లి ఒత్తిళ్లకు తలొగ్గిన నాయకత్వం 

ప్రతిపాదనను వ్యతిరేకించిన పలువురు


అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఏపీ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎన్జీవో) అంతర్గత సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీఎన్జీవో హోంలో ఆదివారం జరిగింది. మూడు రాజధానులకు మద్దతు పలకాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సమావేశం ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. పలువురు నాయకులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడినట్లు తెలిసింది. అయితే మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వమే వెనక్కి తగ్గిందని, పార్టీ ఉద్యమం చేస్తోందని, మనకెందుకీ గోల అని పలువురు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలుగా మనమెందుకు దానిపై స్పందించాలని చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే తాడేపల్లి ఒత్తిడికి తలొగ్గి మూడు రాజధానులకు మద్దతు పలకాలని సంఘం రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని నేడో, రేపో అధికారికంగా వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-10-17T09:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising