ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇంపాక్ట్‌’తో అదనపు భారం మోపొద్దు: సీపీఎం

ABN, First Publish Date - 2022-08-13T08:21:58+05:30

‘ఇంపాక్ట్‌’తో అదనపు భారం మోపొద్దు: సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 60 అడుగులపైన ఉన్న రహదారుల పక్కన కొత్తగా నిర్మించే భవనాల అనుమతికి అదనంగా ఇంపాక్ట్‌ ఫీజు పేరుతో భారం వేసే ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ‘‘ఇప్పటికే భవన నిర్మాణ రంగం సంక్షోభంలో ఉంది. మరోవైపు భవన నిర్మాణానికి అనుమతుల కోసం లైసెన్స్‌ ఫీజులు, డెవల్‌పమెంట్‌ చార్జీలు, మంచినీరు, డ్రైనేజీ కనెక్షన్లకు అడ్వాన్సులు.. ఇలా పలు రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి చాలవన్నట్టుగా మళ్లీ ఇప్పుడు అదనంగా భూమి విలువ ఆధారంగా ఇంపాక్ట్‌ ఫీజు వసూలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలతో మరింత భారం పడుతుంది. భవన నిర్మాణ రంగంపై అదనపు భారాన్ని మోపే ఇంపాక్ట్‌ ఫీజును ఉపసంహరించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-13T08:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising